ఈ మేకపోతు ధర ఎన్ని కోట్లో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా మేకలు, గొర్రెలను గుంపుగా అమ్మితే ఒక మోస్తారులో డబ్బులు వస్తాయి.. విడివిడిగా అమ్మితే మ‌రొక ధ‌ర ఒకరకంగా ఉంటుంటుంది. ఎంత ఉ‍త్తమ జాతికి చెందిన మేక అయినా.. గొర్రె అయినా మహా అయితే లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందేమో అనుకుంటారు. కానీ ఓ మేకపోతు అన్నిటికంటే చాలా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించిన‌ది ఈ మేకపోతు. ఆస్ట్రేలియాలోని మర్రకేశ్‌ అనే మేక గతంలో ఉన్న రికార్డుల‌ను బ్రేక్ చేసి తాజాగా వార్తల్లో నిలిచింది.

ఆస్ట్రేలియాలో మర్రకేష్ అనే మేక అత్య‌ధిక‌ మొత్తంలో $21,000కి విక్ర‌యించారు. దాదాపు 21 వేల డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ. 15,64,983 ధర పలికిన‌ది. మర్రకేశ్‌ అనే పేరు కలిగిన ఈ మేకపోతు ప్రపంచలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచి చరిత్ర సృష్టించింది. పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ పట్టణంలోని కోబార్‌లో నవంబర్‌ 25న ఈ మేకపోతు అమ్మకం కోసం వచ్చింది. ఈ మేకపోతును ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి కొనుగోలు చేసాడు. ఈ మేక పోతు చూడడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ ధర చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.. అంత చిన్న‌గా కాకుండా మధ్యస్థంగా ఉన్న‌ ఈ మేక పోతు చాలా త్వరగా పెరుగుతొందత. త్వరగా మందతో కలిసిపోతుందని మోస్లీ వెల్ల‌డించాడు . గతంలో ఆస్ట్రేలియాలో ఓ మేక 12 వేల డాలర్లు పలకగా.. తాజాగా మర్రకేస్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసి ప‌న్నెండు కాస్త రివ‌ర్స్‌గా 21 వేల డాల‌ర్ల‌కు చేరుకుంది.

Share.