ఈ మాయ పేరేమిటో సినిమా నిలిపివేత, క్షమాపణలు చెప్పిన చిత్ర బృందం

Google+ Pinterest LinkedIn Tumblr +

నూతన దర్శకుడు రాము కొప్పుల దర్శకత్వంలో, రాహుల్ విజయ్ హీరోగా నటించిన ” ఈ మాయ పేరేమిటో ” సినిమా సెప్టెంబర్ 21 వ తేదీన విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం చోటు చేసుకుంది. ఈ సినిమాలోని ” అరిహంతానం ” అనే పాటలో జైన్ మతానికి చెందిన మంత్రాన్ని లిరిక్స్ రూపంలో వాడుకోవటం పై వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. పలు చోట్ల జైన్ మత పెద్దలు సినిమా ప్రదర్శన కూడా నిలిపివేశారు. ఈ సినిమాకి మణి శర్మ స్వరాలూ అందించగా, శ్రీ మణి రచయితగా వ్యవహరించారు.

ఇక తాజగా ఈ వివాదం పై చిత్రానికి సంబంధించిన వీ ఎస్ క్రియేటివ్ వర్క్స్ వారు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు.
” నిన్న ఉదయం మా చిత్రంలోని ఒక పాట లో ఉన్న లిరిక్స్ జైన్ మతానికి చెందిన వారి మనోభావాల్ని గాయపరచాయి అని మా దృష్టికి వచ్చింది. ఇది తెలిసిన వెంటనే మేము తక్షణం యూ ట్యూబ్ లో ఆ పాటని తొలగించాం. అటు తర్వాత మీ మతానికి చెందిన కొంత మంది నెల్లూరు, గుంటూరు, కాకినాడ లో మా చిత్రం ప్రదర్శన నిలిపి వేయాలని ఆందోళన చేసారని తెలిసింది. మేము వెంటనే స్పందించి ” అరిహంతానం ” పాటలోని మీరు అభ్యంతరం వ్యక్తం చేసిన లిరిక్స్ ని మ్యూట్ చేయించాము. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని థియేటర్స్ లో కూడా ఈ లిరిక్స్ ని మ్యూట్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకున్నాం.

ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఈ మాయ పేరేమిటో టీం నుండి మీ అందరికి క్షమాపణలు తెలుపుతున్నాం ” అని లేఖలో వెళ్లడించారు.

 

Share.