ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ తమన్నా 16 సంవత్సరాలు కావస్తోంది. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా, తన మాటలతో తన డాన్స్ తో బాగా ఆకట్టుకుంటోంది. మొదటిగా శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది తమన్నా. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో హ్యాపీడేస్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. ఆ తర్వాత తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది.

సోషల్ మీడియాలో కూడా తమన్నా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతూనే ఉంది. అందుచేతనే ఈ మిల్కీ బ్యూటీ అంటారు అభిమానులు. అయితే గత సంవత్సరం కరోనా కారణంగా చాలా లావు అయిపోయింది తమన్నా. అందుకోసం కొన్ని యోగాసనాలు వర్కవుట్లు వంటివి చేసి సన్నబడింది. అయితే గత కొద్దిరోజులుగా తమన్నా కు సంబంధించి కొన్ని ఫోటోలు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అందులో తమన్నా చాలా లావుగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన తమన్నా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

https://www.instagram.com/reel/CXAyY1vJzGV/?utm_source=ig_embed&ig_rid=48b5ed86-aad2-4a5c-8dde-453f13efb26f

Share.