మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన సుస్మితాసేన్ తన తండ్రి పుట్టిన రోజున ధనిష్టా గ్రామ ద్వారా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. సుస్మితాసేన్ ఒక ఎమోషనల్ మెసేజ్ ను పోస్ట్ చేసింది. హ్యాపీ బర్తడే బాబా.. మీరు ప్రేమతో నిండిన అద్భుతమైన వ్యక్తి మీరు నా తండ్రి కావడం, అలాగే నా పిల్లలకు మీరు తాత కావడం నేను చేసుకున్న అదృష్టం అని తెలియజేసింది.
ఇక అంతే కాకుండా మీరు ఒక గొప్ప అల్టిమేట్ గ్రాండ్ ఫాదర్.. ఇక మీ లోనే ఉన్న ప్రశాంతత ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూ.. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. మీ కూతురు గా నన్ను పుట్టించిన అందుకు దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సుస్మితాసేన్ ఒక పోస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా తన తండ్రి తో దిగిన ఒక ఆసక్తికర ఫోటోను కూడా ఆమె షేర్ చేస్తూ నెటిజన్లలో పంచుకుంది. ఈమె చెప్పిన ఈ మాటలకి నెటిజెన్స్ ఫిదా అయిపోయారు.