ఏకంగా సింహాలనే దత్తత తీసుకున్న మెగా కోడలు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినటువంటి ఉపాసన తాజాగా రెండు సింహాలను దత్తత తీసుకుంది.విక్కీ , లక్ష్మి అని పిలువబడే రెండు ఏషియన్ సింహాలను ఆమె ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన 2 లక్షల రూపాయల చెక్కును క్యూరేటర్‌ రాజశేఖర్‌కు అందజేశారు. సోదరి అనుష్పల కామినేనితో కలిసి వచ్చిన ఆమె ముందుగా జూపార్కును తిలకించారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యూరేటర్‌ నాగమణి, పీఆర్‌ఓ హనీఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

ఉపాసన అపోలో ఆసుపత్రికి సంబంధిచిన వ్యవహారాలను చూసుకుంటూనే సామాజసేవలోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు ఉపాసన ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె మూగజీవాల పరిరక్షణ కూడా తీసుకోవాలని సంకల్పించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఒక ఏడాది పాటు రెండు సింహాలు దత్తత తీసుకొని వాటికి కావాల్సిన అన్ని అవసరాలను ఆమె దగ్గరుండి చూసుకుంటాను అన్నట్లు తెలిపింది.

Share.