ఈడి ఆఫీస్ కు హాజరైన ఐశ్వర్య రాయ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విశ్వసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలిగా వెళ్ళిన ఐశ్వర్యారాయ్ అక్కడ కూడా ఒక ఇంటి కోడలిగా తనకంటూ ఒక మార్క్ ను సెట్ చేసుకుంది . ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ ఈడీ ఆఫీస్ కు హాజరైంది అనే వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈమె ఎందుకు ఈడీ ఆఫీస్ కు హాజరయ్యింది.అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టాక్స్‌ ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ఐశ్వర్యను ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నోటీసులు ఇఛ్చింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద అధికారులు ఐశ్వర్యను ప్రశ్నిస్తున్నారువిదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో 2017 నుంచి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీకి నోటీసులు జారీ చేసింది.LRS కింద 2004 నుంచి వారి విదేశీ చెల్లింపులపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇందుకు సంబంధించి తనకు విదేశాల నుంచి 15 ఏళ్లుగా వచ్చిన చెల్లింపుల రికార్డులను ఈడీకి సమర్పించింది ఐశ్వర్య.

ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తివంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి తమ సంపదను షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని 2016లో లీకైన పనామా పేపర్స్‌లో ఉంది. ఆ పేపర్స్‌లో ఐశ్వర్య రాయ్‌ సహా భారత్‌కు చెందిన ప్రముఖుల పేర్లు వచ్చాయి.

Share.