బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు కొద్ది రోజుల క్రితం ఆర్యన్ ఖాన్ చిక్కిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయంలో మరొక ఒక ట్విస్ట్ ఎదురైంది. అది ఏమిటంటే క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ ప్రమేయం ఉందని దానికి అనుకూలంగా ఎలాంటి సాక్ష్యం లేదని బాంబే హైకోర్టు తెలిపింది. దాంతో ఆర్యన్ కు బెయిల్ కూడా మంజూరు చేసింది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆరోపించిన విధంగా నిందితుల మధ్య కుట్రను చూపించడానికి ఎలాంటి సానుకూల సాక్ష్యం కనిపించలేదని కోర్టు తెలిపింది. నిందితులు కుట్రకు పాల్పడ్డారని చెప్పడానికి ఆర్యన్ మొబైల్ నుంచి వాట్సాప్ చాట్ ను రికవరీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేశారు.
అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ షిప్ లో ncb అధికారులు ఆర్యన్, తన స్నేహితులను తీసుకువచ్చి ఆరోజు విచారించకుండా ఆ మరుసటి రోజున విచారించి అరెస్టు చేయడం జరిగింది. అయితే వీరి వద్ద డ్రగ్స్ ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. ఈ విషయం ఇంకా ఎంత వరకు వెళుతుందో తెలియడం లేదు.