‘దొరసాని’ టీజర్ రిలీజ్!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల నటవారసులు వస్తున్న నేపథ్యంలో మొదటి సారిగా మెగా బ్రదర్ నాగబాబు తనయ కొణిదెల నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ హీరోయిన్ గా రానిద్దామనుకున్నా అది కుదరక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్, జీవిత ల కూతురు శివాత్మిక ‘దొరసాని’సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో యూత్ క్రేజీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు దేవరకొండ విజయ్.

ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘దొరసాని’సినిమాతో పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఇక టీజర్ ని చూస్తుంటే..ఒకప్పుటి దొరల గడీల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

“వీనికేం తెల్వదు పీకదు… దొరసానులెప్పుడైనా బయటకు వత్తార్రా?”, “నేను చిన్న దొరసాన్ని ప్రేమిస్తానురా… అంటే దొరసాని కూడా నన్ను చూత్తాంది”, “మీరు దొరసాని… కాదు దేవకి… కాదు మీరు నా దొరసాని” అనే డైలాగులు బాగున్నాయి. ఈ తరహా సినిమాలు తెలుగులో ఎన్నో వచ్చాయి. మరి ఈ సినిమా ఇద్దరు నటులకు ఎంత వరకు లైఫ్ ఇస్తుందో చూడాలి.

Share.