సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం SSMB -28. ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ,శ్రీ లీల నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ కూడా చేశారు. మహేష్ బాబు ఇందులో స్టైల్ అండ్ స్వాగతం స్మోక్ చేస్తూ నడుచుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ పోస్టర్ తో మహేష్ బాబు నిజంగానే వస్తున్నాడేమో అనే అంతగా అభిమానులు ఫీలింగ్ లోకి పడిపోయారు అభిమానులు.. మహేష్ బాబు డ్రెస్సింగ్ స్టైల్, బ్యాక్ గ్రౌండ్ వాకింగ్ స్టైల్ కూడా చాలా ఎలిమెంట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మహేష్ బాబు చేతిలో ఉన్న బీడీ మహేష్ బాబు స్మోకింగ్ స్టైల్ కి మహేష్ అభిమానులకు సపరేటు క్రేజ్ ఏర్పడింది.. గతంలో అతడు, పోకిరి ,అతిధి ,ఒక్కడు వంటి సినిమాలలో మహేష్ బాబు ఎక్కువగా స్మోక్ చేస్తూ కనిపించారు..
మహేష్ బాబుని సూపర్ స్టార్ గా మార్చిన ఒక్కడు చిత్రంలో మహేష్ స్మోకింగ్ స్టైల్ కి అప్పటి యూత్ బాగా ఫిదా అయ్యారు. స్మోకింగ్ స్టైల్ లో కూడా ఒక ఆర్ట్ ఉందని మహేష్ ని చూశాకే అర్థమయింది. అంతటి స్వాగ్ని మెయింటైన్ చేసే మహేష్ బాబు సితార పుట్టిన తర్వాత స్మోకింగ్ ని వదిలేయడం జరిగింది తన సినిమాలలో స్టైల్ కోసమే కాలుస్తా కానీ అభిమానులు దాన్ని రియల్ లైఫ్ లో ఫాలో అవుతారు అందుకే హెల్త్ చెడిపోగుతుందని మహేష్ బాబు సినిమాలలో కూడా స్మోక్ చేయడం మానేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మహేష్ బాబుతో ఆన్ స్క్రీన్ స్మోక్ చేయించారు త్రివిక్రమ్ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.