సూపర్ స్టార్ అనగానే మీకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు రజనీకాంత్.. రజినీకాంత్ సినిమాలని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఈయన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు.. శ్రీదేవి దగ్గర నుంచి తమన్నా ,కీర్తి సురేష్ వరకు ఆల్మోస్ట్ అందరి హీరోయిన్లతో నటించారు. ఇలా అన్ని జనరేషన్ల హీరోయిన్లతో కలిసి నటించడం అందరికీ సాధ్యం కాదు ఓన్లీ రజినీకాంత్ కి మాత్రమే సొంతం
ఒకప్పుడు శ్రీదేవి, రజినీకాంత్ కాంబినేషన్ కు ఎంతో మంచి క్రేజ్ ఉండేది..వీళ్లను వెండితెర మీద చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లేవారు. వీరిద్దరూ కలిసి తెలుగు ,హిందీ ,కన్నడ ,తమిళం భాషలలో నటించారు. వీరిద్దరూ తెరమీద మాత్రమే కాకుండా తెర వెనకాల కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. వీరిద్దరిది ఎంత మంచి స్నేహమంటే రజనీకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు శ్రీదేవి కూడా ఐదు రోజులు భోజనం చేయలేదట.
అంతేకాదు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా అప్పట్లో వినిపించేవి. అయితే రజిని పెళ్లికి ముందు తరచూ శ్రీదేవిని కలిసే వారట.. ఎందుకంటే అప్పటికే శ్రీదేవి కమలహాసన్ తో ప్రేమలో పడి మోసపోయి బాధలో ఉండేదని తనని ఓదార్చడం కోసం శ్రీదేవిని కలిసేవాడని సమాచారం..కానీ శ్రీదేవి తన పట్ల రజిని కాంత్ ప్రేమ చూపిస్తున్నాడని పెళ్లి చేసుకుందామా అని అడిగిందట శ్రీదేవి..కానీ రజనీకాంత్ నాకెప్పుడూ ఆ ఉద్దేశం లేదని కానీ ఆమె ఒప్పుకుంటే ఆమె చెల్లెలని పెళ్లి చేసుకుంటానని శ్రీదేవితో అన్నారట.
ఆ మాట రజనీకాంత్ చెప్పటంతో శ్రీదేవి తట్టుకోలేకపోయింది.. నాతో సన్నిహితంగా ఉంటూనే నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా అని అన్న మాటను ఆమె సహించలేకపోయింది. దాంతో రజనీకాంత్ ని దూరం పెట్టేసింది. ఈ సంఘటన తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి.. ఇక అప్పటినుంచి శ్రీదేవి రజనీకాంత్ మధ్య దూరం పెరిగిపోయిందట.