టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన స్టార్డం గురించి హోదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వేసిన బాటలోనే నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ లు ఇండస్ట్రీకి వచ్చి తమకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో సఫలం అయ్యారు. ముఖ్యంగా వీరిలో గురించి మాట్లాడితే ఆయన క్యారెక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితమయ్యారు. అలా ఒకపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరొక పక్క నిర్మాతగా మారి మంచి మంచి సినిమాలు తీశారు. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణరంగం వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. అయితే ఈ మధ్యనే మరలా నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా మారారు.
రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేసి కొంతమేర లాభ పడ్డట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కూడా సినిమాలలో బిజీగా మారిపోయారు. కూతురు నిహారిక వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ తన కెరియర్ను ఎంజాయ్ చేస్తోంది. ఇక నాగబాబు ఆయన కొడుకు , కూతురు సక్సెస్ వెనక ఆయన భార్య పద్మజ ఉంది అన్న విషయం చెప్పక మానదు. చిరంజీవి సరైన వయసులోనే పెళ్లి చేసుకున్నా.. నాగబాబు మాత్రం 29 సంవత్సరాలు వరకు బ్రహ్మచారి గానే ఉండిపోవడం జరిగింది.
రుద్రవీణ షూటింగ్ సమయంలో కూడా నాగబాబు బిజీగా ఉన్నాడు. ఆ సమయంలోనే నాగబాబు తల్లి అంజనాదేవి.. పద్మజను బంధువుల పెళ్ళిలో చూసి ఎవరీ అమ్మాయి చాలా బాగుంది అని అనుకుందట. అక్కడ ఆ పెళ్ళికి పద్మజ పెళ్లి కొడుకు తరఫున వస్తే.. అంజనాదేవి పెళ్లికూతురు తరపున పెళ్ళికి వచ్చారట. అదే సమయంలో పద్మజా బంధువుల అమ్మాయి అని తెలిసి అంజనదేవి సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగింది తానే మా ఇంటి కోడలు కావాలని పట్టుబట్టి మరి నాగబాబుకిచ్చి వివాహం జరిపించిందట అంజనాదేవి. ఇక అలా నాగబాబును పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలో భాగమైంది పద్మజ.