టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ సావిత్రి ఎన్నో సినిమాలలో నటించి మహానటి అని పేరు కూడా తెచ్చుకుంది. మహానటి సావిత్రి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా సావిత్రి సినిమాలు వస్తే అభిమానులు కన్నార్పకుండా చేస్తున్నారంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు.. అంతేకాకుండా ఆమె సినిమాల్లో నటించి ఎన్నో ఆస్తులు కూడా పెట్టింది కానీ నమ్మిన వారే మోసం చేయటంతో తన ఆస్తిపాస్తులు అన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. సావిత్రి గురించి తన కూతురు విజయ్ చాముండేశ్వరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి చూద్దాం.
విజయ్ చాముండేశ్వరి మాట్లాడుతూ ..సావిత్రి గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అంతేకాకుండా సావిత్రి గారి అల్లుడు ,అత్తగారి కి బంగారం అంటే చాలా ఇష్టం ఆమె మార్కెట్లోకి ఏ కొత్త నగ వచ్చినా కూడా కొనుగోలు చేసేది. సావిత్రి బీరువా నిండా బంగారం ఉండేదనీ సమాచారం. ఒకవేళ ఏదైనా షాపింగ్ ఓపెనింగ్ ఉంటే సావిత్రి గారే ముందు వెళ్లి వారికి బాగా నగలు కొనుగోలు జరగాలని ముందు బోని తానే చేసేదట.
ఇక విజయ్ చాముండేశ్వరి వారి అమ్మ గురించి మాట్లాడుతూ మా అమ్మ దగ్గర చాలామంది స్నేహితులు నగలను అడిగి తీసుకు వెళ్లేవారు కానీ అమ్మ చనిపోయాక ఏ ఒక్కరు కూడా వాటిని తిరిగి ఇవ్వలేదని ఇక మా అమ్మ దగ్గర గాజులు పెట్టటానికి బాక్సులు సరిపోక రిబ్బన్ తో కట్టి వాటిని బీరువాలో పెట్టుకునేది. ఈ విషయం ఇన్కమ్ టాక్స్ వారికి తెలియడంతో మా అమ్మ నగల మీదే కన్ను పడింది. దాంతో ఆ నగలన్నీ తీసి డబ్బాలో పెట్టటానికి ప్లేస్ సరిపోక ఒక బెడ్ షీట్ పరచి అందులో నగలన్నీ ఓ కుప్పల పోసి తీసుకెళ్లారు. ఆమె ఎంతో ప్రేమగా చేయించుకున్న నగలన్నింటిని తీసుకు వెళ్తుంటే మా అమ్మ చాలా బాధపడింది. అంటూ ఆమె గురించి తన తల్లి గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయింది.