సౌత్ ఇండస్ట్రీలో గాన కోకిలగా పేరు తెచ్చుకున్న సింగర్ సుశీల ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇమె ఎన్నో సినిమాల్లో అద్భుతంగా పాడి అలరించింది. తన గాత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సుశీల పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈమె మ్యూజిక్ డిప్లమా చేసింది. మొదటగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. అలాగే కొన్ని కచేరీలకు వెళుతూ ఉండేది.. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు గారు ఒక కొత్త గొంతు కోసం వెతుకుతుండగా సుశీల గారు దొరికారు. ఈమె మొట్టమొదటిగా తమిళంలో పాడింది. ఇక ఆ తర్వాత తెలుగులో మిస్సమ్మ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
చెప్పాలంటే 40 ఏళ్లుగా అగ్ర గాయనిగా కొనసాగింది. ఇది కాస్త పక్కన పెడితే.. సుశీల గారి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.సుశీల గారి కుటుంబంలో ఆమె ఒక్కతే గాయని అనుకుంటే పొరపాటే ఆమెతో పాటు తన తమ్ముడు,మేనకోడలు కూడా సింగర్. ఇప్పుడు రీసెంట్ గా అమే మనవరాలు కూడా గిటారిస్టుగా ఉన్నారు. ఇక తన కొడుక్కి తన మేడ కోడలు సంధ్యా నీ ఇచ్చి వివాహం జరిపించారు. అయితే సంధ్యా కూడా మంచి సింగర్ ఎన్నో మంచి పాటలు పాడారు.
సంధ్యా గారు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయింది.. ఒకపక్క ఇంటి బాధ్యతలను తీసుకొని కుటుంబాన్ని చూసుకొనే బాధ్యతను తనకే ఇవ్వడంతో ఈమె పెద్దగా పాపులర్ కాలేకపోయింది. అయినప్పటికీ కూడా తన కోడలు గురించి సింగర్ సుశీల ఒక అద్భుతమైన మాటను చెప్పారు. అదేమిటంటే సంధ్యా గారి గాత్రం అచ్చం నాలాగే ఉంటుందని తాను పాడిన పాటలు నేను పాడానని చాలామంది అనుకుంటున్నారంటు ..ఆమె ఇటీవల యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది.