తెలుగు ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా పేరు సంపాదించుకున్నది హీరోయిన్ శ్రీదేవి.. ఈమె చిన్నతనం నుంచే సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి రాను రాను మంచి అవకాశాలను దక్కించుకుంది. ఇలా ఒక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది శ్రీదేవి. అప్పట్లో ఉన్న అగ్ర హీరోలు అందరితో ఈమె నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సంగతి మనకు తెలిసిందే.. శ్రీదేవికి తెలుగులో ఉన్న పేరు కంటే బాలీవుడ్ లో అంతకు పదిరెట్ల పేరు సంపాదించుకుంది.
ఇప్పటికీ కూడా చాలామందికి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే ఆలోచించకుండా శ్రీదేవి అని పేరు చెప్తారు. అప్పటి తరం హీరోలకే కాదు ఇప్పటి తరం హీరోలకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం.. అప్పటి తరం హీరోలు అయితే శ్రీదేవి సినిమాలో ఒక ఛాన్స్ వస్తే చాలు అని అనుకునేవారు. అయితే ఒక స్టార్ హీరో మాత్రం శ్రీదేవితో కలిసి నటించడానికి చాలా భయపడ్డాడట. ఇంతకు ఆ హీరో ఎవరనుకున్నారా అక్కినేని నాగార్జున..
శ్రీదేవి నాగార్జున తండ్రి నాగేశ్వరరావు తో చాలా సినిమాలలో నటించింది. అలాంటి హీరోయిన్ తో సినిమాలు తీయడం అంటే ఆమె నటన ముందు నేను నిలుస్తానా లేదా అనే భయం ఉండేదట నాగార్జునకి.. 1988వ సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్లో ఆఖరి పోరాటం అనే సినిమా వచ్చింది..ఆ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ను సాధించిందో చెప్పనవసరం లేదు.
ఆ సినిమా తీయాలన్నప్పుడే శ్రీదేవి పక్కన నటించడానికి నాగార్జున ఓనికి పోయాడట. ఎందుకంటే ఆల్రెడీ తన తండ్రితో శ్రీదేవి నటించింది కనుక నాగార్జున భయపడేవాడట. ఆ తరువాత ఆమెతో రెండో సినిమా చేశాడు ఆ సినిమాలో ఏమాత్రం భయం లేదట..వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు నాలుగు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు హిందీలో వచ్చాయి. రెండు సినిమాలు తెలుగులో వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాలేవి రాలేదు. అయితే శ్రీదేవి అందరితో నటించింది కానీ బాలయ్యతో మాత్రం నటించలేకపోయింది.