నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి ఇటీవల అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.. గత రెండు రోజులుగా ఆమె ఆహారం మంచినీళ్లు కూడా తీసుకోకపోవడం వల్లే అలేఖ్యరెడ్డి నీరసించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు వైద్యం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహం.. వీరికి ముగ్గురు పిల్లలు.. ఒక కుమారుడు.. ఇద్దరు కూతుర్లు .. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో తారకరత్న కన్నుమూత పెను విషాదాన్ని నింపింది.
తారకరత్న మృతితో అలేఖ్య రెడ్డి పిల్లలు ఒంటరి వారయ్యారు. 23 రోజులపాటు చికిత్స పొంది మృత్యుతో పోరాడిన తారకరత్న ఓటమిపాలై శివైక్యం చెందారు. తారకరత్న ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆమె కూడా అక్కడే ఉన్నారు. తారకరత్న ఆరోగ్యంగా తిరిగి రావాలని ఎంతో శ్రమించారు.. చివరికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియడంతో ఆమె అన్న పానీయాలు కూడా తీసుకోలేదు.. దీంతో నీరసించి పోయినట్లు సమాచారం.. నందమూరి తారకరత్న చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే అయితే నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో తారకరత్నను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు పంపించారు.
అక్కడే 23 రోజుల పాటు మృత్యుతో పోరాడిన ఆయన చివరికి తుది శ్వాస విడిచారు. దీంతో తారకరత్న భౌతిక కాయాన్ని స్వగృహం మోకిలాలో ఉంచారు. అభిమానుల సందర్శనార్థం ఈరోజు ఫిలిం ఛాంబర్ లో వుంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.