టాలీవుడ్ లో అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీదేవి ఇప్పటికీ కూడా ఈమెను ఈమె నటనను అభిమానులు మరవలేకపోతున్నారు. శ్రీదేవి మరణ వార్త ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ గా మారుతు ఉంటుంది. శ్రీదేవి దుబాయ్ పెళ్లికని వెళ్లి అక్కడ బాత్రూం లో పడి మరణించిన సంగతి మనకు తెలిసిందే.. అంతేకాకుండా ఆమె మరణం సహజంగా కాదని ఒక మిస్టరీగా జరిగిందని ఇప్పటికీ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీదేవికి ఆమె మరణిస్తాననే వార్త ముందే తెలుసు అని సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది.
అసలు విషయం లోకీ వెళితే… శ్రీదేవి దుబాయ్ పెళ్లికి వెళ్లేన రోజే దైవదర్శనం కోసం గుడికి వెళ్లిందట.ఇక శ్రీదేవితో కూడా ఎవరూ రాలేదట. అక్కడ ఉన్న పూజారి మీకు ఏదో గండం ఉంది అని చెప్పారట.కానీ ఆ మాటలను శ్రీదేవి పట్టించుకోలేదట. కానీ రెండు రోజుల తర్వాత కూడా ఆ పూజారి చెప్పిన మాటలే చెవిలో వినిపిస్తున్నట్లు శ్రీదేవికి అనిపించాయట. ఇక దాంతో శ్రీదేవి నాకు నిజంగానే ప్రమాదం ఏమైనా జరుగుతుందా అని ఆలోచించిన శ్రీదేవి వెంటనే వారిద్దరి కూతుర్లను పిలిపించి తన ఆస్తిపాస్తులను ఇద్దరి పేరిట సమానంగా రాసిందట.
అయితే ఇంట్లో వారు వీటన్నింటిని గమనించి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఊరికే అంటూ సమాధానం ఇచ్చిందట శ్రీదేవి..ఆ తరువాత సరిగ్గా ఒక నెలకు అనగా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ పెళ్లికి వెళ్లి అక్కడ బాత్రూం లోనే మరణించింది. ఇలా జరగటంతో శ్రీదేవి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆఖరి క్షణంలో కూడా కూతుర్ల గురించి ఆలోచించి వారికంటూ తనవంతు ఏదో చేయాలని ఆత్రుతతో తన ఆస్తి మొత్తాన్ని తన కూతుర్ల పేరిట రాసిందట శ్రీదేవి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.