సినిమా అనగానే హీరో, హీరోయిన్స్ గుర్తుకొస్తారు. చాలా సినిమాలలో కమెడియన్ లేనిదే సినిమా ముందుకు సాగదు అన్న సంగతి మనకు తెలిసిందే. ఇంకా చెప్పాలంటే కామెడీ ఉన్న సినిమాలే చాలా బాగా గుర్తుండిపోతాయి. ఇక అప్పట్లో బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, సుధాకర్ వీరు లేనిదే సినిమా ఉండేది కాదు. అంతేకాకుండా సినిమాలో కామెడీ లేకపోతే అది అసలు సినిమానే కాదు.
ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కమెడియన్ అంటే వెన్నెల కిషోర్, సత్య, రంగస్థలం మహేష్ వంటి వారు గుర్తుకొస్తారు. సత్య కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి మొట్టమొదటిగా సత్య పిల్ల జమిందార్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇప్పుడు పలు అవకాశాలను తన ఖాతాలో వేసుకొని చాలా బిజీగా గడిపేస్తున్నారు. సత్య ఇండస్ట్రీలో ఇంతగా ఎదగటానికి ముందు ఏం చేసేవాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సత్య ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాదులో చిన్న చిన్న పనులను చేస్తూ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే వాడట. అయితే అప్పుడే జబర్దస్త్ ధనాధన్ ధనరాజ్ సత్యాకు పరిచయమై జబర్దస్త్ కార్యక్రమంలో ఒక అవకాశాన్ని కల్పించాడు. అయితే అప్పటికే ధనరాజ్ సినిమాలలో బాగా రాణిస్తున్నాడు. ఆ తరువాత జబర్దస్త్ లో కూడా మంచి పొజిషన్లో ఉండటంతో సత్య ను జబర్దస్త్ షోలో కనిపించేలా చేశాడు. ఇలా సత్య కొన్ని షోలలో కనిపిస్తూనే సినిమాలో అవకాశాలను దక్కించుకొని బిజీగా గడిపేస్తాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం సత్య, నాగశౌర్య నటిస్తున్న చిత్రం రంగబలి. అందులో కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గర అయ్యేలా ట్రై చేస్తున్నాడు. ఏదేమైనా సత్య ఇలాగే కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగాలని ఆయన ఫ్యాన్స్ పదేపదే కోరుకుంటున్నారు.