టాలీవుడ్ లో మొట్టమొదటగా సీతాకోక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది షీలా. ఈమె చిన్నతనంలోనే దాదాపు 20 సినిమాలలో నటించింది. ఇక ఈమె తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో నటించి అక్కడ ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక అల్లు అర్జున్ తో పరుగు సినిమాతో అందరి దృష్టిలో పడింది. ఈ బ్యూటీ ఇక ఆ తరువాత మస్కా, అదుర్స్, హలో ప్రేమిస్తారా, రాజు భాయ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.
ఇక బన్నీతో నటించిన పరుగు సినిమాలు ఆమె అందంతో అమాయకత్వంతో కుర్రకారును తన వెంట తిప్పుకుంది షీలా. అయితే తనకు ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి సినిమాలకు దూరమైపోయింది. 2011లో బాలకృష్ణ పరమవీరచక్ర సినిమా తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. అయితే ఒకానొక సందర్భంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన షీలా బాగా బక్కగా గుర్తుపట్టలేనంతగా కనిపించింది. ఆ తరువాత మరెక్కడా కనిపించలేదు. అయితే ఆమె క్యాన్సర్ మహమ్మారి బారిన పడిందని అందుకే సడన్గా సినిమాలకు దూరమైందని వార్తలు వచ్చాయి. రహస్యంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారని వార్తలు వచ్చాయి.
ఇది కాస్త పక్కన పెడితే మూడేళ్ల క్రితం 2020 మార్చిలో కేరళకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో కలిసి మూడుముళ్ల బంధం లోకి అడుగు పెట్టింది. ఇక చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా వీరి వివాహం జరిగింది. సినిమాలకు దూరమై క్యాన్సర్ నుండి కోలుకొని ఆమె భర్తతో కలిసి సూపర్ మార్కెట్ను నడుపుతోందట. అయితే ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కానీ సోషల్ మీడియాలో ఒక ఫోటోను కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోవడం లేదు. పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయింది షీలా.