ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తారకరత్న గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. తారకరత్న గడిచిన కొద్ది రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ పాలు కావడం జరిగింది. దీంతో తారకరత్న సేఫ్ గా బయటికి రావాలని నందమూరి అభిమానులతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి నందమూరి తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఏం చేస్తారు ఆయన ఎవరు అనే విషయాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
దివంగత నటుడు నందమూరీ తావరక రామారావుకు మొత్తం 12 మంది సంతానం. ఇందులో ఎనిమిది మంది మగపిల్లలు ఇందులో ఐదవ కుమారుడే నందమూరి మోహన్ కృష్ణ. ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఇండస్ట్రీలో ఈయన కేవలం సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈయన కూడా 1956 సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టినరోజుని జన్మించారు. ఇక ఎన్టీఆర్ సంతానం విషయానికి వస్తే.. రామకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణ ,మోహన్ కృష్ణ, జూనియర్ రామకృష్ణ, జయశంకర్ కృష్ణ సంతానం కలరు ఇందులో ఐదవ వ్యక్తి మోహన్ కృష్ణ.
ఇక ఆడపిల్లల విషయానికి వస్తే భువనేశ్వరి, పురుందేశ్వరి, ఉమామహేశ్వరి. ఇక మోహన్ కృష్ణ విషయానికి వస్తే చిన్నతనం నుంచే అంతా నిమ్మకూరు చెన్నైలో కొనసాగింది. వివాహమయ్యే సమయానికి వీరంతా హైదరాబాదులోనే సెటిల్ అయ్యారు. చిన్న వయసు నుంచే సినిమాల పైన ఆసక్తి ఉండడంతో ఆయనకు నటన పైన కాకుండా సినిమాటోగ్రఫీ పైన ఎక్కువ ఇష్టం ఉండడంతో అటువైపుగా అడుగులు వేశారు డిగ్రీ చేస్తున్న సమయంలోనే తన బాబాయ్ త్రివిక్రమ్ రావుతో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవారు. ఆ తర్వాత దానవీరశూరకర్ణ చిత్రానికి అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశారు. 1980లో ప్రముఖ నిర్మాత యు విశ్వాస్వరరావు కూతురిని శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి నందమూరి తారకరత్న సంతానం.