టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ పర్సన్స్ లో నటుడు సుహాస్ కూడా ఒకరు.. కానీ ఈయన రేంజ్ మాత్రం సినిమా సినిమాకు మరింత పెరిగిపోతుంది. కలర్ ఫోటో, హిట్-2, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న సుహాస్ అంచలంచెలుగా పెరిగిపోతున్నాడు.రీసెంట్గా సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇతని ఖాతాలో మరో సక్సెస్ చేరనుందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్లో భాగంగా సుహాస్ మాట్లాడుతూ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలో బన్నీ ఫ్యాన్ గా కనిపిస్తానని చెప్పుకొచ్చాడు.నాకు ఆర్య మూవీ రిలీజ్ అయిన సమయం నుంచే డాన్స్ నేర్చుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేదట. అలా డాన్స్ చేయడానికీ అంతేకాదు గట్టిగా ప్రయత్నాలు కూడా చేశాను అని తెలిపారు సుహాస్.
అయితే ఇప్పుడు వస్తున్న వార్తలపై స్పందిస్తూ సుహాస్ దానికి సమాధానంగా నేను రెండు సంవత్సరాల క్రితం ఒప్పుకున్న సినిమాలే ఇప్పుడు నేను చేస్తున్నానని అప్పుడు ఏ రెమ్యూనిరేషన్ తీసుకున్నాను ఇప్పటికీ అదే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని అన్నారు.అప్పుడు ఒప్పుకున్న సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచుతానని సుహాస్ కామెంట్స్ చేశారు.
అనుకోకుండా నేను చిన్న తిరుపతిలో పెళ్లి చేసుకున్నానని తాళిబొట్టు కొనుక్కొని బట్టలు కొనుక్కొని వెళ్లాలని ఆ సమయంలో పంతులు మీ అవతారం ఏంటి నువ్వు పెళ్లి కొడుకు వేనా అని తిట్టారని సుహాస్ ఈ సందర్భంలో తెలియజేశారు. నా పెళ్ళికి ఎలాంటి బ్యాండ్ లేదు. ఎలాంటి ఆర్భాటాలు కూడా లేవు అనుకోకుండా నా పెళ్లి జరిగిపోయింది అంటూ సుహాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సుహాస్ ని రంగంలో ఇంకాస్త ముందుకు పోవాలని తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి విజయాన్ని సాధించాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.