తన హాస్యంతో ఎప్పుడూ కూడా తెలుగువారి ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు నటుడు బ్రహ్మానందం. ఇక ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా రాణిస్తూ కొన్ని వందల పైగా చిత్రాలలో నటించి తన కామెడీలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. ఇటీవల పలు అనారోగ్య సమస్యల కారణంగా బ్రహ్మానందం తక్కువగా సినిమాలలో నటిస్తున్నారు. ఇలా ఉన్నప్పటికీ అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నిన్నటి రోజున బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈయన గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారాయి.
బ్రహ్మానందం మొదట తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. మొదట ఆహనాపెళ్ళంట చిత్రంలో బ్రహ్మానందం కామెడీ ఆ చిత్రానికి హైలెట్ కావడంతో పాటు సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత నుండి బ్రహ్మానందం పలు కామెడీ పాత్రలలో నటిస్తూ స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించారు. ఒకానొక దశలో ఏడాది మొత్తం విడుదలైన ప్రతి చిత్రాలలో కూడా బ్రహ్మానందం కచ్చితంగా కనిపిస్తూ ఉండేవారు.అంతలా ఈయన కామెడీ కి ప్రేక్షకులు అలవాటు పడ్డారని చెప్పవచ్చు.
నెంబర్ వన్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన బ్రహ్మానందం రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ మొత్తంలోనే ఉండేదట. ఒకానొక సందర్భంలో ఒక్కో చిత్రానికి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు. బ్రహ్మానందం ఒక్కో కాల్ సీటుకి దాదాపుగా లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు అన్నట్లుగా సమాచారం. బ్రహ్మానందం సంపాదించిన వాటిలో ఎక్కువగా భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేసేవారట అలా మిగిలిన డబ్బుని పొదుపు చేస్తూ ఉండడంతో ఈయన ఆస్తి విలువ రూ .500 కోట్లకు పైగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.