భూమా మౌనిక రెడ్డి ఆస్తి విలువ ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు మనోజ్ ,భూమ మౌనిక పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు మార్చి మూడవ తేదీన మంచు లక్ష్మి ఇంట్లో మౌనిక, మనోజుల వివాహం జరిగింది. అటు మనోజ్ కు ఇటు మౌనికకు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. మనోజ్, మౌనిక మరో మూడు రోజుల తర్వాత హనీమూన్ కు వెళ్ళబోతున్నారనీ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజానిజాలకు సంబంధించి ఇంకా స్పష్టత అయితే రాలేదు. భూమా మౌనిక పొలిటికల్ ప్లాన్ కూడా భారీ రేంజ్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది.

Manchu Manoj plans to get married on 3rd March

ఇక భూమా మౌనిక ఆస్తి ఏకంగా రూ .2000 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఈమె మొదట భర్తతో విడిపోయినప్పుడు భరణం కింద కూడా మౌనికాకు కొన్ని వందల కోట్ల రూపాయలు దక్కినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా భూమా మౌనిక కొడుకు ధైర్యవ్ రెడ్డి బాధ్యతలను కూడా మంచు మనోజ్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.భూమా మౌనిక కొడుకు విషయంలో మనోజ్ చాలా ప్రేమగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం .మోహన్ బాబు కుటుంబంలో చాలామందికి వివాహం ఇష్టం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

మౌనికాకు ఈ వివాహం రెండో వివాహం కావడంతో మోహన్ బాబు కుటుంబ సభ్యులలో కొంతమంది అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .చాలా సంవత్సరాల నుంచి భూమా, మంచు కుటుంబాల మధ్య సంబంధాలు ఉన్నట్లు సమాచారం. భూమా అఖిలప్రియ భూమా మౌనిక పెళ్లికి సంబంధించిన బాధ్యతలను చూసుకున్నారు. ప్రస్తుతం మనోజ్ భార్యతో కలిసి అత్తారింటికి చాలా గ్రాండ్ గా వెళ్లడం జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

Share.