రామ్ చరణ్, ఉపాసనలకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే..రామ్ చరణ్ ,ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని చిరంజీవి తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే ..అయితే రామ్ చరణ్ ,ఉపాసన చాలా గ్యాప్ తీసుకొని తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందానికి అవధులు లేవు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆస్కార్ అవార్డును అందుకోవటానికి ఉపాసన కూడా వచ్చింది.
అంతేకాకుండా బేబీ బుంప్ తో టూర్లు కూడా వేశారు. అందుకు సంబంధించిన ఈ ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ అయినప్పటికీ ఆమెకి డెలివరీ ఖర్చు కోటిన్నర అయ్యిందట. తన సొంత హాస్పిటల్ లోనే డెలివరీ అయ్యి కూడా కోటి రూపాయలు ఖర్చు కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఇక జూన్ 20న 1:46 నిమిషాలకు ఉపాసన ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తను నార్మల్ డెలివరీ కావడంతో పాప పుట్టిన మూడు రోజులకే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది. అంతేకాకుండా ఉపాసన డెలివరీ కోసం విదేశాల నుండి పెద్ద పెద్ద గైనకాలజిస్టులను తీసుకువచ్చారట. అలాగే ఆమె డెలివరీ టైమ్ లో అక్కడున్న అపార్ట్మెంట్ ఫ్లోర్లను మొత్తాన్ని ఖాళీ చేయించారట.అంతేకాకుండా విదేశాల నుండి కొన్ని ఎక్యుమెంట్స్.. అలాగే కొంతమంది స్పెషలిస్టులను కూడా తీసుకువచ్చారట. వారితోనే డెలివరీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే తన సొంత హాస్పిటల్ లోనే కోటిన్నర పైగానే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును మొత్తం ఉపాసన దంపతులు భరించినట్లు కూడా సమాచారం. అయితే ఉపాసన డెలివరీ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మధ్యతరగతి కుటుంబం వారైతే ఆమెకు పెట్టిన డెలివరీ ఖర్చుతో లైఫ్ లాంగ్ బతకచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.