రాజమౌళికి ఈ నటుడుకి మధ్య గల బంధం ఏంటో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో డైరెక్టర్ గా రాజమౌళి పాన్ వరల్డ్ డైరెక్టర్ గా పేరు పొందారు.. ఈమధ్య తీసిన ఆర్ఆర్ ఆర్ సినిమాతో దేశమంతటా క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో నటించేవారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన మంచి గుర్తింపు వస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొట్టమొదటిగా శాంతి నివాసం అనే సీరియల్ తో తన కెరీర్ మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు రెగ్యులర్ గా కనిపించే నటులు కొంతమంది ఉన్నారు. వారెవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.

Chatrapathi Sekhar : 'నేనెప్పుడూ కూడా రాజమౌళిని అవకాశాలు అడగలేదు' : ఛత్రపతి  శేఖర్

రాజమౌళి తీసిన శాంతి నివాసం నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు నటుడు శేఖర్ సినిమాల్లో మనకు కనిపిస్తారు. శేఖర్ మాత్రమే కాదు రాజీవ్ కనకాల,సమీర్ లాంటి నటులు కూడా రాజమౌళి తీసిన సినిమాల్లో మనకు తరచుగా కనిపిస్తారు. అయితే శేఖర్ పేరు కూడా చత్రపతి శేఖర్ గా మారిపోయింది. ఎందుకంటే చత్రపతి సినిమాలో ఆయన చేసిన భద్రం క్యారెక్టర్ చాలా పాపులర్ అయ్యారు.. దాంతో ఆయన్ని అప్పటినుంచి ఇప్పటివరకు చత్రపతి శేఖర్ అంటూ ఉంటారు.

రాజమౌళి తీసిన అన్ని సినిమాల్లో శేఖర్ ఒక చిన్న క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. రాజమౌళి అయితే ఆయన కోసం ఒక సీన్ అయినా రాసి ఉంటారేమో అనిపిస్తుంది. అంటే వీరిద్దరి మధ్య అంత మంచి స్నేహ బంధానికి గల కారణం ఏమిటంటే శేఖర్ యొక్క మంచితనం అని చెప్పవచ్చు. రాజమౌళి చిత్రంలో చిన్న క్యారెక్టర్ అయిన పర్వాలేదు కచ్చితంగా మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. ప్రస్తుతం RRR చిత్రానికి పలు రకాలుగా అవార్డులను అందుకుంటు ఉన్నారు.

Share.