టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో రాశి కూడ ఒకరు. ఈమె హీరోయిన్ గానే కాకుండా ఐటెం గర్ల్ గా పేరు సంపాదించుకున్నది. రాశి చెన్నైలో జన్మించి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ పొజిషన్కు ఎదిగింది. అలా తనకు సినిమా అవకాశాలు తగ్గి అడపాదడపా సినిమాలలో నటిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం రాశి బుల్లితెరపై జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువలోనే ఉంది.
ఇకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. రాశి కి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు మధ్య రిలేషన్ ఉంది. వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. కానీ రాశి స్టార్ హీరోయిన్ కావటానికి సురేఖనే కారణమట ..అవును నిజం అది ఎలా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గోకులంలో సీత ఈ మూవీకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిని తీసుకోవటానికి కారణం సురేఖనేట.
అంతేకాకుండా చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ హిందీలో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే చిరంజీవి ఒకసారి చెన్నైకి ఫ్యామిలీతో కలిసి వెళ్లారట. అప్పుడు రాశి చెన్నైలోనే ఉండటంతో ఆమెని కలవటానికి చిరంజీవి తన ఫ్యామిలీ కలిసి రాశీ ఇంటికి వెళ్లి తన తండ్రిని కలిశారట. అయితే ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న రాశీ చిన్నప్పటి ఫోటోలను చూసి సురేఖ ఫిదా అయిపోయింది.
అప్పుడే సురేఖ ఒక నిర్ణయం తీసుకొని గోకులంలో సీత సినిమాకి రాశీ అయితే చాలా బాగుంటుందని చిరంజీవికి చెప్పటంతో ఆయన అంగీకారంతోనే రాశిని ఆ సినిమాకి హీరోయిన్ గా ఎంపిక చేశారట. అప్పటినుంచి హీరోయిన్ రాశికి చిరంజీవి కుటుంబానికి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడిందట. ముఖ్యంగా రాశి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి కుటుంబమే కారణమని చెప్పవచ్చు.