టాలీవుడ్ లో చిరంజీవి ఏ బ్రాండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉండగానే సినిమా అవకాశాలను అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈయన మనకి ఎక్కువ సినిమాలలో హీరో గానే తెలుసు చిరంజీవి మొట్టమొదట నటించిన సినిమా పునాది రాళ్లు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన స్వ శక్తితోనే కష్టపడి నటుడిగా ఎదిగాడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెగాస్టార్ పొజిషన్ కు చేరుకున్నారు.
ఎంతో మంది దర్శకుల చుట్టూ నిర్మాతలు చుట్టూ తిరిగిన అవకాశాలు వచ్చేవి కావట.. డిగ్రీలో బీకాం పూర్తి చేసి. నటనకు కావాల్సిన శిక్షణ అందుకున్నాడు. ఆయనలో మంచి ప్రతిభ కనబడడంతో పునాదిరాళ్లు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో చిరంజీవి పెర్ఫార్మెన్ చూసి ప్రాణం ఖరీదు సినిమాలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చాడు నిర్మాత క్రాంతి కుమార్.
ఇక చిరంజీవి హీరోగా కొనసాగుతున్న రోజుల్లో విలన్ పాత్రలు పోషించే అవకాశం లభించింది. చిరంజీవికి విలన్ గా చేయడం ఇష్టం లేదట. కానీ నిర్మాతలు ఏమనుకుంటారో లేకపోతే మళ్లీ అవకాశాలు వస్తాయో లేదో అనే భయంతో విలన్ పాత్రల్లోకి అడుగు పెట్టాడు. 1979 లో “కథ కాదు” అనే సినిమాలో చిరంజీవి విలన్ గా కనిపించారు. ఆ తరువాత శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన మోసగాడు చిత్రంలో విలన్ పాత్రను పోషించారు .ఆ తరువాత న్యాయం కావాలి, పున్నమినాగు ,తిరుగులేని మనిషి వంటి కొన్ని చిత్రాలలో నెగిటివ్ పాత్రల్లో నటించాడు. చిరంజీవి గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హీరో క్యారెక్టర్ అని చెప్పి కృష్ణతో కూడా రెండు విలన్ పాత్రల్లో నటించేలా చేశారు. సినీ ఫీల్డ్ లో విలన్ హీరో పాత్రలు చేసిన చిరంజీవి.. హీరోగా ఎదగడం గమనార్హం. ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా విడుదల కాబోతోంది.