టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి చాలామందికి డైరెక్టర్ గానే తెలుసు.కానీ కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన ఒకప్పుడు నిర్మాతగా కొన్ని సినిమాలకు సమర్పకుడిగా పనిచేశారు. రాజమౌళి నిర్మాతగా ఒక పెద్ద సినిమాను కూడా నిర్మించాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ కూడా అయ్యింది.అదే అందాల రాక్షసి ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉండే సమయానికే ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. మగధీర, చత్రపతి లాంటి సినిమాలతో ఆయన రేంజ్ వేరే లెవెల్ లోకి వెళ్లిపోయింది. అందాల రాక్షసి సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సూపర్ హిట్ సాధించాయని చెప్పవచ్చు. హను కథను నమ్మి ఆయన దర్శకత్వంలో నిర్మాతగా రాజమౌళి వ్యవహరించారంటే హను రాఘవపూడిని రాజమౌళి ఎంతగా నమ్మారో చెప్పవచ్చు.
ఇక అప్పటికే రాజమౌళి ఈగ సినిమాకు పని చేస్తున్నారు అయినా కూడా రాజమౌళి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అందాల రాక్షసి స్టోరీని బట్టే సినిమా ఆడుతుందో లేదో ఊహించారు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని ఊహించారు రాజమౌళి. అందుకే అందాల రాక్షసి సినిమా ఊహించని రేంజ్ లో క్రేజ్ను సంపాదించుకుంది.ఎందుకంటే ఆయన తీసిన ప్రతి సినిమా ఎంతో గొప్ప విజయాన్ని దక్కించుకొని ప్రపంచమే గర్వించదగ్గ దర్శకుడిగా కూడా మారాడు రాజమౌళి. ఇక చివరకు ఆస్కార్ రేంజ్ కు కూడా తన సినిమాలు వెళ్లాయంటే రాజమౌళి పట్టుదల, శ్రమ, ఆయన ముందుచూపు తన ఆలోచనలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత ముందు చూపు ఉంది కాబట్టే ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా పేరు పొందారు.