సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అంటే.. ఆ సినిమాని మల్టీస్టారర్ మూవీ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలామంది హీరోలు మల్టీ స్టారర్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా గతంలోనే చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ లాంటి హీరోలు అంతా కలిసి ఒక సినిమాలో నటించారని బహుశా చాలామందికి తెలియదని చెప్పాలి. మరి వీరందరూ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది తారలను ఒకే స్క్రీన్పై చూడడం అంటే అది నిజంగా అద్భుతమైన దృశ్య కావ్యం అని చెప్పాలి.
ఈ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ తో సహా పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇకపోతే వెంకటేష్, వరున్ తేజ్, వెంకటేష్, పవన్ కళ్యాణ్, వెంకటేష్ నాగ చైతన్య వంటి మల్టీ స్టారర్ మూవీలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. అలాగే గతంలో కూడా చిరంజీవి మరియు బాలకృష్ణ తో పాటు నాగార్జున, కృష్ణ , శోభన్ బాబు కూడా కనిపించారు. ఆ సినిమా ఏదో కాదు వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు. ఇందులో ఒక పాట ఉంది. ఆ పాటలో చిరంజీవి, బాలకృష్ణ తో పాటు నాగార్జున, కృష్ణ, శోభన్ బాబు కూడా కనిపించడం జరిగింది.
మొదటి జనరేషన్ కి సంబంధించిన కృష్ణ ,శోభన్ బాబు అలాగే రెండవ జనరేషన్ కి సంబంధించిన చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్ , నాగార్జున ఇలా అందరూ ఆ పాటలో కనిపించడంతో అభిమానుల ఆనందాలకు అవధులు లేవని చెప్పవచ్చు. ఏది ఏమైనా సినిమా హీరోలంతా ఒక ఫోటోకి ఫోజులిస్తేనే ఆనందాన్ని తట్టుకోలేము అలాంటిది ఒకే స్క్రీన్ పై ఇంతమంది హీరోలు రెండు జనరేషన్ లకి సంబంధించిన వాళ్ళు కనిపించడంతో థియేటర్లలో ఈలలు ఏ రేంజ్ లో మోగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.