చిరంజీవి తన తండ్రితో నటించిన సినిమా ఏంటో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు క్రేజ్ ఉన్న హీరో లలో చిరంజీవి కూడా ఒకరు.ఆయన తెలుగు అభిమానులకు ఎంతో ఇష్టమైన నటుడనీ చెప్పవచ్చు.చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్లు ఈ సినిమా నుంచి ఇప్పుడు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా దాకా అభిమానుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది.. చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి తనకంటూ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా, స్వయంకృషి, క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదిగాడు.

Konidela Venkat Rao, చిరంజీవి తండ్రి కూడా నటుడే... ఇద్దరూ కలిసి ఒకే  సినిమాలో - chiranjeevi's father konidela venkat rao act role as minister in  mantri gari viyyankudu movie - Samayam Telugu

ఇక ఆయన అసలు పేరు కొణిదెల శివ శంకర ప్రసాద్ మొదట్లో చాలా ఒడిదుడుకులు తట్టుకొని స్టార్ హీరోగా ఎదిగారు.. అలా ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. మరెన్నో రికార్డులను సృష్టించాడు. చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు చిరంజీవి అండతోనే చాలామంది సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా ఆయన తమ్ములు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.అటు తర్వాత చిరంజీవి కొడుకు (రామ్ చరణ్) సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేశాడు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మెగాస్టార్ తండ్రి వెంకట్ రావు కూడా నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లో నటించారు.

Chiru Father Venkata Rao Acted:మామగారితోనే కాదు తండ్రి తోనూ సిల్వర్  స్క్రీన్‌ను షేర్ చేసుకున్న మెగాస్టార్.. ఆ సినిమా ఏమిటో తెలుసా..! | Megastar  chiranjeevis father ...

అయితే చిరంజీవి తండ్రి నటించారని చాలామందికి తెలియదు. ఇంతకీ ఆయన ఏ సినిమాలో నటించారంటే చిరంజీవి హీరోగా చేసిన మంత్రిగారి వియ్యంకుడు అని సినిమాలో నటించారు. అంతేకాకుండా 1969లో జగత్ కిలాడీలు అనే మూవీలో కూడా నటించారు. కానీ అప్పటికి చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. వెంకట్రావు గారికి చాలా సినీ అవకాశాలు వచ్చినప్పటికీ కొనసాగించలేకపోయాడు. ఎందుకంటే ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం వల్ల కుటుంబం కోసం తన బాధ్యతల కోసం సినీ రంగాన్ని వదిలిపెట్టి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇక తన తండ్రికి ఉన్న ఆసక్తి చిరంజీవికి ఉండటంతో ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగి టాలీవుడ్ లో ఒక అగ్ర హీరోగా నిలిచారు.

Share.