టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ శృతిహాసన్.ఈ మధ్యనే అగ్ర హీరోలతో ట్రెండీలోకి వచ్చింది. అలా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలో కనిపించి తెగ సందడి చేసింది ఈ అమ్మడు. శృతిహాసన్ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి తన సత్తా చాటుతోంది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ సైతం పలు రకాలుగా టాటూస్ వేయించుకుంటూ ఉంటారు.తాజాగా శ్రుతి మరో పచ్చబొట్టును వేయించుకుంది. అంతేకాకుండా అంతకుముందే ఆమె మెడ మీద మణికట్టు మీద రెండు టాటూలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వేయించుకున్న టాటూఈమె విభిన్నమైనదిగా ఉంది.
ప్రతి ఒక్కరిలో ఏదో టైం లో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే శృతిహాసన్ వేయించుకున్న పచ్చబొట్టును చూస్తే శృతిహాసన్ లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 40 ఏళ్లు దగ్గర పడుతున్న ఈ బ్యూటీలో ఎలాంటి చేంజింగ్ లేదు. ఈమె స్టైల్ విషయము కొస్తే చెప్పనవసరమే లేదు. రొటీన్ కు ట్రెండ్ కు భిన్నంగా వ్యవహరించే ఈమె తాజాగా వేయించుకున్న టాటూ అందరినీ ఆకర్షిస్తోంది.
ఇంతకు శృతిహాసన్ వేయించుకున్న టాటో తన ఇష్ట దైవమైన మురుగన్ ఆయుధాన్ని వేయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన మనసులో మురుగనుకు ప్రత్యేకమైన స్థానం ఉందని తను వేసుకున్న పచ్చబొట్టుతో అందరికీ చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా తమిళంలో తన పేరును వేయించుకోవటం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. తను వేయించుకున్న కొత్త టాటూ ని ఇన్స్టాల్ లో షేర్ చేసి అందరిని మెస్మరైజ్ చేసింది.
తనకు మురుగన్ పై ఎంత భక్తి ఉందో ఈ టాటూ ద్వారా అందరికీ చూపించింది. శృతిహాసన్ లో వస్తున్న కొత్త మార్పులను చూసి వారి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అలాగే శృతిహాసన్ కు ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలని మరీ మరీ కోరుకుంటున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ టాటో వైరల్ గా మారుతోంది.