తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ లోనైనా సరే అవలీలగా నటిస్తూ ఉండే నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో మామగా, విలన్ గా,ఫ్రెండ్ గా పలు క్యారెక్టర్లలో నటించి తన నటన ప్రతిభను చూపించారు ప్రకాష్ రాజ్. ఇక టాలీవుడ్లో రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీహరి ఒకప్పుడు విలన్ గా పలు చిత్రాలలో నటించారు. ఆ తర్వాత భద్రాచలం వంటి సినిమాలలో హీరోగా నటించిన మంచి విజయాన్ని అందుకున్నారు.
అయితే అనారోగ్య కారణంగా ఆయన కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అయితే శ్రీహరి ప్రకాష్ రాజు ఇద్దరు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక శ్రీహరి భార్య డిస్కో శాంతి వాళ్ళ అక్కనే ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నారు. దీనివల్ల ప్రకాష్ రాజ్,శ్రీహరి ఇద్దరు తోడి అల్లుళ్ళు అయ్యారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఆమెను వదిలేసి ఇంకో వివాహం చేసుకున్నారు. ఇక శ్రీహరి కొడుకు కూడా హీరోగా ఒక సినిమాలో నటించారు.కానీ అది పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ సినిమాలలో విలన్ గా చేస్తూ బిజీగా ఉంటున్నారు. రీసెంట్గా వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే రంగమార్తాండ చిత్రంలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీహరి కుటుంబం కూడా పలు ఇబ్బందులలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా శ్రీహరి లాంటి నటుడు మళ్లీ రారని చెప్పవచ్చు.