బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ స్టార్ హీరోల కంటే వారి భార్యలదే ఆదాయం ఎక్కువ గా ఉంటుంది..మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే హీరోలకి మించి డబుల్ స్థాయిలో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు ఒక్కో సినిమాకి రూ .100 కోట్లు సంపాదిస్తే వారి భార్యలు మాత్రం రూ .100 కోట్లకు పైగానే సంపాదిస్తున్నారు.అదే లిస్టులోకి వస్తోంది అందాల ముద్దుగుమ్మ గౌరీ ఖాన్ ఇంతకు ఈమె ఎవరనుకున్నారా బాలీవుడ్ కింగ్ బాద్షా సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వైఫ్
ఈమె ఒక తల్లి గానే కాకుండా ఇంటీరియర్ డిజైనర్ గా పలు వ్యాపారంగంలో సక్సెస్ ఉమెన్ గా పేరు సంపాదించుకొని దూసుకుపోతోంది. ఈమె రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వెబ్ సిరీస్ నిర్మిస్తూనే ఉంది. మరోపక్క డిజైనర్ గా కూడా రానిస్తోంది. షారుఖ్ ఖాన్ తో పోలిస్తే గౌరీ షారుఖ్ ఖాన్ ఆదాయం కోట్లల్లో ఉంటుందట.ఇక ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ హీరో అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమాకు ఈయన రూ.200 కోట్లు తీసుకుంటాడు
అయితే షారుక్ ఖాన్ భార్య గౌరీ అలా కాదు ఒక సినిమా సక్సెస్ అయ్యిందా..? కొన్ని కోట్లు వచ్చి ఆమె ఖాతాలో చేరిపోతాయి. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్ గా కొన్ని వందల కోట్లు దాచి పెట్టింది. నివేదికల ప్రకారం గౌరీ ఖాన్ ఆస్తుల నికర విలువలు దాదాపు రూ .27325 కోట్లు విలువ చేస్తున్నట్లు సమాచారం. షారుక్ ఖాన్ భార్యకు ముంబైలో ఒక లగ్జరీ హోటల్ కూడా ఉంది ఆ హోటల్ ని ఆమె స్వయంగా డిజైన్ చేసుకుంది. అంతేకాకుండా ఆమెకు బోలెడన్ని స్థిరస్తులు కూడా ఉన్నాయి. షారుక్ ఖాన్ భార్యకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.