నందమూరి వారసుడు తారకరత్న అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అనే నిజాన్ని ఇప్పటికే అభిమానులు మర్చిపోలేక పోతున్నారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడి మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న అభిమానులకు నిరాశను మిగులుస్తూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటుండగా.. అభిమానులు మాత్రం తమ హీరో చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇకపోతే తారకరత్న పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మరొకసారి వీక్షిస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే తారకరత్నతో స్క్రీన్ షేర్ చేసుకున్న కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల గురించి కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే తారకరత్న నటించిన సూపర్ హిట్ చిత్రాలలో భద్రాద్రి రాముడు కూడా ఒకటి. డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2004 జూన్ 25వ తేదీన విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇందులో హీరోయిన్ గా తారకరత్న సరసన రాధిక కుమారస్వామి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తిరిగి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. ఈమె ఎవరు? ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో ఉంది ? అని తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. రాధికా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. గతంలో వీరిద్దరి గురించి చాలా రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. కానీ ఎట్టకేలకు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.రాధిక (Radhika) ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో నిర్మాతగా ఉన్నత శిఖరాలకు చేరుకుంది అని చెప్పవచ్చు