ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి పేరు కచ్చితంగా వినే ఉంటారు. రాజమౌళితో సినిమా లో నటించడం అంటే అంత ఈజీ కాదు.ఆయన ఒక్కసారి అనుకున్నారంటే ఏదైనా సరే అయిదారేళ్ల పాటు మరొక సినిమా గురించి అసలు ఆలోచించాడు డేట్స్ కూడా మొత్తం తనకే ఇచ్చేయాల్సింది అన్నట్లుగా ఉంటారు. ఇంత సాధించిన రాజమౌళి వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలు ఇప్పటికీ చాలామందికి తెలియవు.
ముఖ్యంగా రాజమౌళి ఎలాంటిది ఇష్టపడతారు ఎలాంటివి తింటారు అని ఎవరో ఒకరు చెప్పితే తప్ప ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలలో మాట్లాడలేదు. టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్ కి ప్రెజర్ వల్ల కొన్ని అలవాట్లు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్మోక్ చేస్తూ ఉంటారు లేకపోతే ఆల్కహాల్ వంటివి తాగకపోతే నిద్ర కూడా పోకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఒక దురాలవాటు కూడా లేని ఏకైక వ్యక్తి ఎవరంటే రాజమౌళిని అని చెప్పవచ్చు.
రాజమౌళి కేవలం కాలక్షేపం కోసమే కుటుంబంతో కలిసి కూర్చొని కార్డ్స్ మాత్రమే ఆడుతారట. ఇక ఎక్కడికి వెళ్లినా ఆయన చేతిలో డబ్బులు ఉండవు డ్రైవర్ దగ్గరే ఎప్పుడు కొంత క్యాష్ పెడుతుంటారట. ముఖ్యంగా రాజమౌళి భార్య రమ ఏదైనా రాసిస్తే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమట. ముఖ్యంగా తన సంతకం 10 రకాలుగా పెడుతూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుందట. రాజమౌళికి తన కుటుంబమే బలం ఆ కుటుంబం వల్లనే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.