టాలీవుడ్లోకి ఉప్పెన సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇక తన తదుపరి చిత్రాన్ని ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కబడి నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. మొదటి సినిమా విడుదలై దాదాపుగా రెండు సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇంకా తన తదుపరి చిత్రాన్ని షూటింగ్ మొదలుపెట్టలేదు బుచ్చిబాబు.. ఆ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా మొదలు పెట్టాలనుకున్న కొన్ని కారణాల చేత పూర్తిస్థాయిలో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
దీంతో సినిమా ఆలస్యం అవుతుందని దాదాపుగా అదే కథను రామ్ చరణ్ కోసం కొంత మార్పులు చేసి బుచ్చిబాబు తన రెండవ సినిమాని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపుగా రూ.300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ కు దాదాపుగా రూ.80 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే బుచ్చిబాబుకు మాత్రం పారితోషకం విషయంలో కాస్త తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా నాన్ థియెట్రికల్ గాని ఈజీగా రూ.150 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక నాన్ థియేట్రికల్ గా మరొక రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కు రూ .80 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నప్పుడు కనీసం డైరెక్టర్ కి 30 కోట్ల ఆయన ఇవ్వాలి.. కానీ కేవలం రూ .18 కోట్ల రూపాయలే ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే డైరెక్టర్ కూడా ఈ విషయంలో పెద్దగా అభ్యంతరాలు తెలుపకుండా ఉన్నారట. ప్రస్తుతం బుచ్చిబాబు కూడా ఈ సినిమా చాలా అవసరము. మరి ఈ సినిమాతో నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా లేక సక్సెస్అయ్యి లాభాలను పొందుతారేమో చూడాలి మరి.