తెలుగు ప్రేక్షకులకు బాంధవి శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ మసూద చిత్రంలో దయ్యం క్యారెక్టర్లు నటించిన ఈ అమ్మాయి అంటే టక్కున గుర్తుపడతారు. ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హర్రర్ చిత్రంగా మసూద్ చిత్రం పేరు పొందింది. ఇందులో నాజియా పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఈ బాంధవి శ్రీధర్. నాజియా క్యారెక్టర్ లో బాంధవి ప్రతి ఒక్కరిని భయపడేలా చేసింది.
అయితే మామూలుగా ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు అందులోని కొత్త క్యారెక్టర్లు కనిపించాయంటే చాలు వెంటనే వాళ్ళ గురించి ప్రేక్షకులు ఆరా తీస్తూ ఉంటారు. అలా మసూద సినిమాతో చాలామంది బాంధవి గురించి నెట్ లో సర్చింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియడం జరుగుతోంది. బాంధవి ఎవరు.?ఆమె ఎక్కడి నుంచి వచ్చింది.! అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
బాంధవి శ్రీధర్ తెలుగు అమ్మాయి ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన ఈమె మొదట మోడలింగ్ ద్వారా సినిమాలోకి అడుగు పెట్టింది అలా 2019లో మిస్ ఇండియా రన్నర్ గా నిలిచిన.. బాంధవి అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో విజేతగా నిలిచింది. తన మొదటి చిత్రమే మసూద.. ఇంతవరకు ఈమె ఏ సీరియల్స్ లో కూడా నటించలేదు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో ప్రయత్నిస్తున్న సమయంలో మసూద్ సినిమాలో ఆఫర్ రావడంతో కంటెంట్ క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పిందట. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.