బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ఇప్పుడే సీజన్ సెవెన్ కూడా ప్రారంభమైంది..ఇందులో 14 మంది కంటిస్టెంట్లుగా వెళ్లారు.. అయితే వీరిలో ఎవరు కంటిన్యూ అవుతారో అన్నది క్లారిటీ రాలేదు. ఈ 14 మంది మధ్య టాస్కులు పెట్టి వీరిలో హౌస్ లో కంటిన్యూ అయ్యే హౌస్ మేట్స్ ను మాత్రమే ఉంచుతారు. దానికోసం హౌస్ లో ఉన్నవారు కంటిన్యూ అవ్వటానికి గట్టిగానే పోటీ పడు తున్నారు. బిగ్ బాస్ సెవెన్ లో పార్టిసిపెంట్ చేసిన వారిలో రతిక రోజ్ ఒకరు. ఈ అమ్మడు తన అందంతో తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అంతేకాకుండా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసి ప్రేక్షకుల చూపును పక్కకు తిప్పకుండా చేస్తోంది.. ఇంతకు రతిక రోజ్ ఎవరు? ఈమె ఏ సినిమాలో అయినా నటించింది అన్న విషయాలను సైతం పలువురు నెట్టిజన్స్ సైతం గాలించారు ఈమెకు సంబంధించి కొన్ని విషయాలు బయటపడడం జరిగింది.
ఇంతకు ఈ రతిక ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈమె అసలు పేరు ప్రియా.. ఈమె మోడలింగ్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తరువాత రతిక రోజ్ గా మార్చుకుంది. గతంలో ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో స్టాండప్ కమెడియన్ గా చేసింది తన జోక్స్ తో అక్కడ కూడా కడుపుబ్బ నవ్వించి మెప్పించింది. అలా ఏడాది పాటు ఆ టీవీ షోలో కనిపించిన రతిక ఉన్నట్టుండి సడన్గా మాయమైంది. ఆ తరువాత మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించి మోడలింగ్ చేస్తూనే పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది
ఆ తరువాత రీసెంట్గా వచ్చిన బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సార్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు అందర్నీ పలకరిస్తూ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది.