టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యనే పెళ్లి బాజాలు మోగాయి. ఇక ఆ జంట ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అవును మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వీరిద్దరూ ఆరేళ్ల నుంచి ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ జంట తాజాగా నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్గా పెళ్లి జరిగిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వీరు పెట్టిన ఫోటోలను చూసిన మెగా అభిమానులు నేటిజెన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. వీరి ఫోటోలను చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఈ జంట చూడడానికి కనుల విందుగా కనిపిస్తోందని కామెంట్స్ వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ జంట ఎప్పుడెప్పుడు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతుందో అని అభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే తాజాగా వీరు మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టి అభిమానుల ప్రశంసలను పొందారు.
ఇది ఎలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరి మధ్య 11 నెలల ఏజ్ గ్యాప్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ పుట్టింది జనవరి 19-1990లో జన్మించాడు ఇక లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15- 1990లో జన్మించింది.
అయితే దీన్ని బట్టి చూస్తే వీరి మధ్య 11 నెలల ఏజ్ గ్యాప్ మాత్రమే ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పట్లో ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఏజ్ విషయంలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీరిద్దరి మధ్య మాత్రం చాలా తక్కువ గ్యాప్ కనబడుతోంది. చెప్పాలంటే ఒకే సంవత్సరంలోనే ఇద్దరు జన్మించారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా వీరిద్దరికీ పెళ్లి విషెస్ కూడా తెలియజేస్తున్నారు.