మెగాస్టార్ చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన నుంచి వస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జనవరి 8వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి..ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వారిలో ఆయన వారసులు మాత్రమే చాలామందికి తెలుసు. కానీ చిరంజీవి బాబాయి కూడా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారే.
ఈ విషయం చాలామందికి పెద్దగా తెలియదని చెప్పాలి. ఈయన తెలుగు సీరియల్స్ లో విలన్ గా బాగా పేరు సంపాదించుకున్నాడు. అడపా దడపా సినిమాల్లో కూడా చిన్నచిన్న క్యారెక్టర్స్ వేసిన ఈయన సీరియల్స్ తోనే బాగా ఫేమస్ అయ్యారు . ఆయన పేరు హరి. స్టార్ హీరో చిరంజీవికి వరుసకు బాబాయి అవుతారు. హరి వయసులో చిరంజీవి కంటే చిన్నవాడే అయినా వరుసకు బాబాయి అవుతారు. హరి నెల్లూరులో టీచర్ ఉద్యోగం చేసేవారు. చిరు ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు.. నీ ప్రయత్నం ఉండాలి.. నన్ను మాత్రమే నమ్ముకొని ఈ రంగానికి రావద్దని చెప్పారట చిరంజీవి.
ఎందుకంటే సినీ పరిశ్రమలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతారు. అలా హరికి ఇండస్ట్రీలో చిన్న చిన్న వేషాలు ఇప్పించారు చిరంజీవి. హీరోకి ఫ్రెండ్, ఒక విలన్ గా చిన్న రోల్స్ చేసిన ఈయన ఆ తర్వాత సినిమాలు మానేసి సీరియల్స్ లోనే పెర్మనెంట్ విలన్ గా సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతం ఇక్కడే సినిమాల్లో నటిస్తున్నారు. సీరియల్స్ లోకి రాకముందు రాఖి, సింహాద్రి, ధోని , మగధీర వంటి సినిమాలలో కూడా నటించాడు.