రజనీకాంత్ కు తల్లి లేని లోటు తీర్చిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా సింపుల్ గా ఉండడానికి ఆయన ఇష్టపడతారు. వరుస ప్రాజెక్టులతో రజనీకాంత్ బిజీగా ఉండగా.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఒక సినిమాలో.. తన కూతురు డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం రూ. 170 కోట్లకు పైగా ఒక్కో సినిమాకు పారితోషకం తీసుకుంటున్న రజినీకాంత్ కు అంత సింపుల్ గా ఉండడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదు. ఇకపోతే రజనీకాంత్ సినిమా జీవితం గురించి అందరికీ తెలుసు కానీ.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా తెలుసని చెప్పాలి. రజినీకాంత్ కెరియర్ తొలినాళ్ళ లో కండక్టర్గా పనిచేసేవారు. సినిమాల్లోకి వచ్చే సమయానికి తల్లిని కోల్పోయారు.

అయితే ఒక మహిళ రజనీకాంత్ కు తన తల్లి ప్రేమను పంచింది అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ఆ సమయానికి తనకు పెళ్లి కాలేదు అని.. సినిమాలతో బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో రెజీనా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడిందని.. ఆమె ఇతరులకు సహాయం చేసే మంచి మనసు ఉన్న మహిళ అని రజనీకాంత్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆమె అమ్మ ప్రేమను పంచారు.. నేను ఒత్తిడి వల్ల ఆసుపత్రిలో చేరితే రెజీనా అమ్మ నాకు సపర్యలు చేశారు. రెజీనా అమ్మ వళ్ళ నేను మామూలు మనిషిని అయ్యాను. అంటూ ఆయన కామెంట్లు చేశారు.

ఇకపోతే మార్చి 8వ తేదీన ఉమెన్స్ డే సందర్భంగా రజినీకాంత్ అమ్మ తనకు రోల్ మోడల్ అని, ఆడవారి గురించి గౌరవంగా చెప్పడంతో ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా యాక్టివ్ గా ఉంటూ విజయాలను అందుకుంటున్న తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రోజురోజూకు ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉండడం గమనార్హం.

Share.