టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక.. కన్నడ పరిశ్రమ నుంచి మొదట కిరిక్ పార్టీ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత తెలుగులో మాత్రం ఛలో సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ .తాజాగా వారసుడు సినిమా ద్వారా మరొకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే బాలీవుడ్లో మిషన్ మజ్ను సినిమా ఈనెల 20వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటిటిలోనే విడుదలయ్యింది.
ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లెక్స్ లో స్ట్రిమ్మింగ్ అవుతోంది. డైరెక్టర్గా శాంతాను బాబ్జి దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో సిద్ధార్థ మల్హోత్ర హీరోయిన్గా నటించారు.రష్మిక హీరోయిన్గా నటించింది. ఇందులో అంధురాలి పాత్రలో రష్మిక నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇమే ఒక్కో సినిమాకు నాలుగు నుంచి రూ.5 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు గా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మిషన్ మజ్ను సినిమాకి గాను ఈమె ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని విషయానికి వస్తే.. ఈ చిత్రం కోసం రష్మిక రూ.3 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక నటన బాగానే ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉంటోంది. మరి ఈ సినిమాతో నైనా ఈ ఏడాది సరైన సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి మరి.