తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి విషయం వినిపించిన సరే చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు.ఒక రకంగా చెప్పాలంటే చాలామంది అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారని చెప్పవచ్చు. ట్రెండుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన ఇమేజ్ను మార్చుకుంటూ ఉంటారు. గతంలో ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటాడో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఒక్కో చిత్రానికి రూ .50 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన మొదటి చిత్రానికి అల్లు అరవింద్ చాలా తక్కువగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో పవను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు చాలానే ఉన్నాయట. ఎంతోమంది దర్శకులను చెక్ చేసి మరి తర్వాత ఇవివి సత్యనారాయణ ను ఎంపిక చేశారట చిరంజీవి. అప్పటికె హిందీలో వచ్చి ఖయామత్ తక్ చిత్రాన్ని తెలుగులో రీమిక్స్ చేసి విడుదల చేయాలని ఇవివి అనుకున్నారట.
ఆ చిత్రమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రంలో అక్కినేని వారసురాలుగా పేరుపొందిన సుప్రియ కూడా హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్ల పనులకు ఇవివి సరికొత్త పోస్టర్ డిజైన్ ను చేసి విడుదల చేశారట. ఆరోజుల్లో ఈ డైరెక్టర్ చేసిన ప్రమోషన్ చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఫోటోతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ అంటించారట. ఈ సినిమా విడుదలకు ముందు అతడే మన పవన్ కళ్యాణ్ అంటూ మరో పోస్టర్ను కూడా విడుదల చేయడంతో ప్రేక్షకులలో చాలా ఆత్రుత నెలకొనిందట. ఇక తర్వాత చిరంజీవి తమ్ముడు అంటూ ప్రచారం జరగడంతో మరింత పాపులర్ అయ్యారు అయితే ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ కేవలం రూ.5 వేల రూపాయలు తీసుకున్నారట.