స్టార్ హీరోల వివాహం వెనుక చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయాలు అభిమానులకు వినిపించగానే కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు.మరి కొంతమంది పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. తెలుగు నటులతో పోలిస్తే తమిళ నటుల ప్రేమ కథలు కచ్చితంగా వారి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన వారిలో హీరో విక్రమ్ కూడా ఒకరు. విక్రమ్ ని ముద్దుగా చియాన్ అని పిలుస్తూ ఉంటారు. హీరో విక్రమ్ లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
హీరో విక్రమ్ ప్రేమ కథ ఒక సినిమా స్టోరీ ని తలతించేలా ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ 1992లో వివాహమైంది ఆయన భార్య పేరు శైలజ బాలకృష్ణన్. వీరికి ఇద్దరు సంతానం కొడుకు ,కూతురు అక్షిత గురవయ్యర్ వీరికి వివాహమైంది హీరో విక్రమ్ కొడుకు గ్రూప్ సైతం హీరోగా తమిళ ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు. ఇక విక్రమ్ ప్రేమ కథ విషయానికి వెళితే.. వీరి పరిచయం ఒక పెద్ద రోడ్డు ప్రమాదం వల్ల ఏర్పడిందట. ఈ ప్రమాదంలో హీరో విక్రమ్ గాయాల పాలయ్యారు.
ఈ ప్రమాదంతో మూడేళ్ల పాటు విక్రమ్ బెడ్ పైన ఉండవలసి వచ్చిందట. సరిగ్గా ఆ సమయంలోనే హీరో విక్రమ్ కి పరిచయమయ్యింది శైలజ బాలకృష్ణన్ .డాక్టర్ గా పరిచయమై స్నేహంతో మొదలైన ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి… ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శైలజ కంటే ముందుగా ఆమె ఇంటికి వెళ్లి..ఒక చీర తీసుకువెళ్లి ఆమె తల్లిదండ్రులకు పెళ్లి ప్రపోజల్ పెట్టారట.ఆ తర్వాత ఐదేళ్లపాటు వీరిద్దరూ కలిసి ఉన్నారట . అలా పెద్దల అంగీకారంతో హిందూ వివాహ వ్యవస్థ ప్రకారమే వీరి పెళ్లి జరిగిందట. ఆ తర్వాత చర్చిలో రెండు సార్లు వివాహం చేసుకున్నారు.