జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవైపు జబర్దస్త్ లో చేస్తూనే మరొకవైపు పలు షోలలో కమెడియన్గా చేసిన ఈయనకు సినిమాలలో అవకాశాలు రావడంతో జబర్దస్త్ లో డేట్లు అడ్జస్ట్ చేయలేక జబర్దస్త్ కి దూరమయ్యారు. ఆ తర్వాత చిన్నచిత సినిమాలకు రైటర్గా పనిచేయాలనుకున్న ఈయనకు సరైన అవకాశం లభించలేదు. కానీ తాజాగా బలగం సినిమాతో తాను డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఎంతలా అంటే థియేటర్లలోనే కాదు ఓటీటీ లో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. దీన్ని బట్టి చూస్తే వేణు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఎక్కడ చూసినా సరే ప్రేక్షకులు బలగం మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు దర్శకుడు వేణు ఎల్దండికి మంచి ఫ్యూచర్ ఉంది అంటూ కూడా జోష్యం చెప్పేస్తున్నారు. ఇక ఈ పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. దాదాపు రూ.22 కోట్ల గ్రాస్, రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. చిన్న సినిమాగా వచ్చిన ఏ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
వాస్తవానికి ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ అన్న హైప్ తప్పితే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా లేరు. అయినా సరే ఆడియన్స్ థియేటర్ కి పోటెత్తారు. ఇంత పెద్ద విజయం నమోదు చేసిన వేణుకి దిల్ రాజు ఎంత పారితోషకం ఇచ్చారనే..ఆత్రుత అందరిలో ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను దిల్ రాజు మీకు ఎంత పారితోషకం ఇచ్చారు అని అడగ్గా..నాకు ఎంత ఇచ్చారు అన్నది చెప్పకూడదు అది ప్రోటోకాల్ కాదు. ఆయనకు నా కథ నచ్చింది అందుకే నాకు మరో ఆఫర్ ఇచ్చారు అంటూ తెలిపారు వేణు.