జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . జబర్దస్త్ కార్యక్రమం ప్రసారమయ్యే ఇప్పటికి పదేళ్లు కావస్తోంది. తెలుగు బుల్లితెర మీద నెంబర్ వన్ షోగా నిలుస్తూ వస్తోంది. టాప్ టిఆర్పి రేటింగ్ను సొంతం చేసుకున్న ఈ షో నుండి కొంతమంది కమెడియన్స్, యాంకర్స్ కూడా తప్పుకోవడం జరిగింది. ఇక ఇందులో నుంచి పాపులర్ అయిన స్టార్స్ సైతం హీరోయిన్స్ గా, కమెడియన్స్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.అలా సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.
ఇక రష్మిక కూడా ఇంచుమించు హీరోయిన్ గా పేరు సంపాదించిన సక్సెస్ కాలేక పోయింది. అనసూయ స్థానంలో గత కొన్ని నెలల క్రితం బుల్లితెర సీరియల్ యాక్టర్ సౌమ్యా రావు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అనసూయ ఉన్నప్పుడు తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళుట .సౌమ్య రావు యాంకర్ గా రావడంతో సౌమ్యరావు రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం ఇప్పుడు బుల్లితెర వర్గాల లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఈటీవీలో వచ్చే శ్రీమంతుడు సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యరావు జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ అయింది.
ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్గానే ఉంటూ పలు రకాలుగా అప్డేట్లను కూడా ఇస్తూ ఉంటుంది. ఇక తనకు ఒక్కో ఎపిసోడ్ కు జబర్దస్త్ నుంచి రూ.85 వేల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం అంటే నెలకు దాదాపుగా నాలుగు ఎపిసోడ్లు ఉంటే రూ.3.5 లక్షలు ఆదాయం అన్నట్లుగా తెలుస్తోంది ఇది కేవలం జబర్దస్త్ ద్వారానే ఈమె సంపాదించే ఆదాయంట ఇక సీరియల్స్ ద్వారా ఇతర ఈవెంట్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.