బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా పేరుపొందిన హీరో హీరోయిన్ కీయారా అద్వానీ ,సిద్ధార్థ మల్హోత్రా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వీరి ప్రేమకు పుల్ స్టాప్ పడుతూ నిన్నటి రోజున వివాహంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా వీరి వివాహ వేడుకలు రాజస్థాన్లోని జైసల్మేర్ కోటలో జరగబోతున్నట్లు తెలిసింది. అయితే ఉన్నట్టుండి వీరి పెళ్లి వాయిదా వేయడం జరిగింది. అయితే వీరి పెళ్లి వాయిదా గురించి ఎక్కడ వీరు అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటికి రావడంతో పెళ్లి తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
గత రెండు రోజులుగా సెలబ్రెటీలు పెళ్లికి సంబంధించి విషయాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీరి పెళ్లి ఖర్చు దాదాపుగా రెండు కోట్లకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సినీ సెలబ్రెటీల వివాహాలలో అత్యధిక ఖర్చు కలిగిన వివాహంలో వీరిది కూడా ఒకటని చెప్పవచ్చు. ఇకపోతే పెళ్లి తర్వాత కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్ర దంపతులు ఉండబోయే ఇంటి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే అందరూ కూడా ముంబైలోని జుహు ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు.ఈ జంట కూడా అక్కడ రూ .70 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఈ బంగ్లా అన్ని సౌకర్యాలతో నిర్మించబడి ఉందని తెలుస్తోంది.మొత్తానికి కియారా, సిద్ధార్థ కెరియర్ పరంగా పర్సనల్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం కియారా RC -15 చిత్రంలో నటిస్తున్నది.