దక్షిణాది సూపర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరు కూడా టక్కును గుర్తుకొచ్చే పేరు రజనీకాంత్ అని చెప్పవచ్చు. మొదట ఒక సామాన్య కండక్టర్గా తన కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత నటన మీద ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అలా ఇప్పటివరకు అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించారు రజినీకాంత్. ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తలైవాగా కూడా పేరు పొందారు రజినీకాంత్.
రజనీకాంత్ స్టార్డం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ ఇతర భాషలలో కూడా రజనీకాంత్ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సృష్టించాయి. రజనీకాంత్ వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా సూపర్ స్టార్ గానే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో నటిస్తూ ఉన్నారు. రజనీకాంత్ 1975లో తన సినీ రంగ ప్రవేశాన్ని చేసినట్లుగా తెలుస్తోంది.ఇప్పటివరకు రజనీకాంత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా తమిళ వాసులకు రజనీకాంత్ వీర అభిమానులను చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రజినీకాంత్ ఆస్తి విలువ ఎంత ఉంటుంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వాటి గురించి తెలుసుకుందాం.
రజనీకాంత్ ప్రస్తుతం ఆస్తి విలువ దాదాపుగా రూ. 400 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 2018లో 50 కోట్ల వార్షిక ఆదాయం ఉన్న వారి జాబితాలో రజనీకాంత్ 14వ స్థానాన్ని సంపాదించారు. ప్రస్తుతం తలైవా నటిస్తున్న జైలర్ చిత్రం కోసం ఏకంగా 120 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులలో సూపర్ స్టార్ కూడా ఒకరు. రజనీకాంత్ కు చెన్నైలో పోమోస్ గార్డెన్ పరిసరాలలో పెద్ద భవనం కూడా ఉన్నట్లు సమాచారం.
ఇక రజనీకాంత్ భార్య లత పేరు మీద ఉన్న పాఠశాలలో కూడా రజనీకాంత్ కు వాటా ఉన్నట్లు సమాచారం. రజనీకాంత్ కు కార్లంటే చాలా ఇష్టము కారులకు వీర అభిమాని అతని వద్ద దాదాపుగా 20 కోట్లు విలువైన రూల్స్ రాయల్స్ ఫౌంటెన్ కార్లు ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ హయ్యర్ ఎడ్యుకేషన్ లో రజనీకాంత్ కు ఒక శీర్షిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది.