అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పూజా హెగ్డే హైప్ మరింత పెరిగింది. ఈ మూవీ ని హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. సంగీతాన్ని తమన్ అందించారు. ఈ సినిమాకి హైలైట్ గా పాటలు నిలిచాయి. ఇదే కాకుండా ఈ సినిమాలో ఆడియన్స్ ని ఆకట్టుకొనే మరొక విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కనిపించి ఒక పెద్ద ఇల్లు.
అల్లు అర్జున్ నిజమైన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని ఇంట్లోకి అడుగు పెడుతున్న సమయంలో ఇంటి గేటు నుంచి చూపిస్తారు.ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఇంట్లో షూట్ చేయడం జరిగింది. ఇక ఈ ఇంట్లో తీసిన సన్నివేశాలు అందరికీ చాలా అందంగా కనిపించాయి. సాధారణంగా సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ వేయడం అందరికీ తెలిసింది అయితే ఈ చిత్రంలోని స్పెషల్ అట్రాక్షన్ గా ఈ ఇంటిని చూపించాలనుకున్నారు అందుకోసం త్రివిక్రమ్ రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఇంటిసెట్ వేయాలనుకున్నారట.అయితే అప్పుడు అల్లు అర్జున్ ఇంటి సెట్ వద్దని నిజమైన ఇంట్లోనే సినిమా చేయాలని కోరారట.
అలా వెతుకుతున్న సమయంలో ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె రచన చౌదరి భర్త ఇల్లు చూసి ఈ ఇంట్లోనే షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది.. ఇక ఈ ఇంటికి కట్టడం కోసం దాదాపుగా 100 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.