టాలీవుడ్ నటవారసుడు నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత మాట్లాడినా ఏం చెప్పినా తక్కువే అనాలి. ఎందుకంటే అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆయన తరువాత ఆయన వారసుడైన నందమూరి బాలకృష్ణ చిన్నతనం నుంచి తన నాన్నతో కలిసి సినిమాలను చేసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి బాలయ్య.
ఆయన మొదటిగా మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనం చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత బాలయ్యకు మరెన్నో అవకాశాలు చుట్టుముత్తాయి. ఈ మధ్యనే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఆన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గర అయ్యాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బాలయ్య అనే పేరు బాలయ్యకు ఎలా వచ్చిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..
అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో ఉన్న వారందరూ కూడా బాలయ్య అని పిలుస్తారు ఆ పేరు ఎందుకు వచ్చిందని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..కానీ దాని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.బాలయ్యతో బి.గోపాల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ను సాధించిందో చెప్పనవసరం లేదు. అదే సమయంలో ఈ సినిమాలోని పాటలు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.
ఆ సమయంలో బి గోపాల్ మీరు ఏ పాటైనా రాయండి ఇందులో ఒక పాట మాత్రం బాలయ్య బాలయ్య అన్న లైన్ తో ఉండాలని కచ్చితంగా చెప్పారు.దాంతో బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అనే పాటను రాసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది..అప్పటినుంచి బాలయ్యకు ఆ పేరు వచ్చిందట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.