టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు ప్రేక్షకులను అలరించి అతి తక్కువ సమయంలోనే స్వర్గస్తులైన విషయం తెలిసిందే .అలా కొంతమంది తమ నటనతో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించేలా ప్రేక్షకులను అలరించి వారి గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారు మరణించేటప్పటికి వారి వయసు ఎంత అన్న విషయం అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో సీనియర్ హీరోయిన్లు ఏ వయసులో మరణించారు అన్న విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
పుష్పవల్లి గారు ఈమె ప్రముఖ హిందీ నటి రేఖ గారి తల్లి.. ఇంకా అలాగే జెమినీ గణేషన్ గారి భార్యగా ఈమె 1936 లో సంపూర్ణ రామాయణం అటు తర్వాత పలు చిత్రాలలో నటించిన పుష్ప గారు 65 సంవత్సరాల వయసులో 1991లో మరణించారు.
తొలి తరం నటీమణి శాంత కుమారి గారు శశిరేఖ పరిణయంసినిమాతో 1936లో ఎంట్రీ ఇచ్చిన ఈమె అనేక చిత్రాలలో చేసి 85 సంవత్సరాల వయసులో 2006 జనవరిలో కాలం చెందారు.
ఆనాటి మరో ఎవర్ గ్రీన్ యాక్టర్ జమున గారు 2023 జనవరిలో ఈమె కన్నుమూశారు. మూగమనసులు, దొంగ రాముడు, వీరకంకణం ఇలా ఎన్నో చిత్రాలు చేశారు.
ఏఎన్ఆర్,ఎన్టీఆర్ తో పలు చిత్రాలు నటించిన జయంతి గారు ఈమె 76 సంవత్సరాల వయసులో 2021 జూలైలో కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ గారితో పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, ఇలా అనేక చిత్రాలు నటించిన ఆయన సతీమణి విజయనిర్మల గారు 73 సంవత్సరాలు 2019 జూన్ లో కాలం చేయడం జరిగింది.
మహానటిగా నాటి నుంచి నేటితరం వరకు కీర్తించబడిన సావిత్ర గారు దేవదాసు మూగమనసులు,రక్తసంబంధం ఇలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె 45 సంవత్సరాలకే 1981 డిసెంబర్ ను మరణించారు.